వైరా నియోజకవర్గం టీఆర్ఎస్ లో ముసలం... అసమ్మతి నేతల భారీ ర్యాలీ!
- వైరా టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ పై వ్యతిరేకత
- నిన్న భారీ ర్యాలీ నిర్వహించిన అసమ్మతి నేతలు
- ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు
టీఆర్ఎస్ జిల్లా నేత బొర్రా రాజశేఖర్ నేతృత్వంలో నిన్న వైరాలో భారీ ర్యాలీ, సభను నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, మదన్ లాల్ పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని... ఆయన వల్ల వైరాలో టీఆర్ఎస్ కు పరాభవం తప్పేలా లేదని అన్నారు. ర్యాలీ సందర్భంగా అసమ్మతి నేతలు, మదన్ లాల్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.