మొత్తానికి రాజ్ తరుణ్ తో రెడీ అవుతున్నాడు
- రాజ్ తరుణ్ హీరోగా కొత్త ప్రాజెక్టు
- దర్శకుడిగా మల్లిడి వేణు
- నిర్మాతగా సాయిరామ్ బాబ్జి
ఇక అల్లు శిరీష్ ను ఒప్పించడానికి కూడా తనవంతు కృషి చేశాడు గానీ, చివరి నిమిషంలో ఆ అవకాశం కూడా చేజారిపోయింది. దాంతో రాజ్ తరుణ్ పై దృష్టి పెట్టాడు. మల్లిడి వేణు వినిపించిన లైన్ నచ్చడంతో రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇద్దరూ కలిసి స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ సాయిరామ్ బాబ్జి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.