'యాత్ర'లో జగన్ పాత్రపై ఫిల్మ్ నగర్ టాక్
- తెలుగులో బయోపిక్ ల జోరు
- షూటింగు దశలో 'యాత్ర'
- వైఎస్ పాత్రలో మమ్ముట్టి
కానీ ఇప్పుడు ఈ సినిమాలో జగన్ పాత్ర కనిపించదని ఫిల్మ్ నగర్ టాక్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర .. ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కడం వరకూ ఈ కథ కొనసాగుతుందట. జగన్ పాత్ర వుంటే ఆ పాత్రకి కూడా ప్రాధాన్యతనిస్తూ వెళ్లవలసి ఉంటుంది. దాంతో రాజశేఖర్ రెడ్డి పాత్రపై ఫోకస్ తగ్గుతుందనేది దర్శకనిర్మాతల అభిప్రాయం. ప్రేక్షకులంతా రాజశేఖర్ రెడ్డి పాత్రతోనే కొనసాగాలనే ఉద్దేశంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.