కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు అమృత ఫిర్యాదు
- సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
- అసత్య ప్రచారాలను ఆపాలని కోరినా... మార్పు లేదు
- చట్టపరమైన చర్యలు తీసుకోండి
తమను కించపరిచే విధంగా ప్రతి రోజు సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తున్నాయని... అలాంటి అసత్య ప్రచారాలను ఆపాలని తాను ప్రాధేయపడినా, ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఐ నాగరాజు స్పందిస్తూ, పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే, పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.