‘ఎన్టీఆర్’ నుంచి నేటి ఉదయం 9:35 గంటలకు సర్‌ప్రైజ్.. వేచి చూడాలన్న చిత్ర యూనిట్!
- అంచనాలను పెంచేస్తోన్న ‘ఎన్టీఆర్’
- సరిగ్గా 9:35 గంటలకు సర్‌ప్రైజ్
- సంక్రాంతికి విడుదల
రోజుకో వార్తతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా, తాజా వార్త అందరిలోనూ ఉత్కంఠ రేపింది. ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, చంద్రబాబునాయుడుగా రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది.