బన్నీకి ఆ దర్శకులిద్దరూ కథలు వినిపించారట!
- విక్రమ్ కుమార్ ప్రాజెక్టుపై సందేహాలు
- త్రివిక్రమ్ ప్రాజెక్టుపై ఆసక్తి
- కథలు వినిపించిన మారుతి - పరశురామ్
తాజాగా బన్నీకి పరశురామ్ .. మారుతి కథలు వినిపించినట్టుగా సమాచారం. అయితే ఈ ఇద్దరిలో ఎవరికీ కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. త్వరలోనే ఆయన ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ తో ప్రాజెక్టు విషయంలో క్లారిటీ వచ్చాకే బన్నీ తన నిర్ణయాన్ని చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. గత రెండు సినిమాలు ఆశించినస్థాయిలో ఆడకపోవడం వలన, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో బన్నీ వున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.