కేసీఆర్ ను ఛీ కొడుతున్నారు: చాడ వెంకటరెడ్డి
- పాలనాకాలం పూర్తి కాకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారు
- ధర్నా చౌక్ ను ఎందుకు ఎత్తేశారో కూడా చెప్పలేదు
- హుస్నాబాద్ సభ తర్వాత కేసీఆర్ కనిపించలేదు
ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను ఎందుకు ఎత్తేశారో కూడా కేసీఆర్ చెప్పలేదని దుయ్యబట్టారు. హుస్నాబాద్ సభ తర్వాత కేసీఆర్ ఇంత వరకు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన కావాలా? లేక నియంత పాలన కావాలా? అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమైపోయానని విమర్శించారు.