నా జీవితంలో నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి ముడిపడిందేమో!: జూనియర్ ఎన్టీఆర్
- మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో చెప్పే చిత్రమిది
- త్రివిక్రమ్ లో ఒక ఆత్మబంధువుని చూశా
- ‘అరవింద సమేత’ ప్రీ-రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్
త్రివిక్రమ్ తో చిత్రం మొదలు పెట్టిన తర్వాత, నెల క్రితం జరిగిన సంఘటన వల్ల.. జీవితం విలువ తనకు అర్థమైందంటూ తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో చెప్పేదే ఈ చిత్రమని, పన్నెండేళ్ల తమ పరిచయంలో త్రివిక్రంలో ఒక స్నేహితుడిని, దర్శకుడిని చూశానని, ఈ సినిమా అయిపోయే లోపు ఒక ఆత్మబంధువుని చూశానని త్రివిక్రమ్ పై తన అభిమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తం చేశాడు.