'పేట' షూటింగులో జాయిన్ అయిన త్రిష
- రజనీకాంత్ హీరోగా 'పేట'
- ఒక హీరోయిన్ గా సిమ్రాన్
- సంక్రాంతికి విడుదల
భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, అనిరుథ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు. రజనీతో నటించే ఛాన్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్టుగా త్రిష చెబుతూ వచ్చింది. ఈ సినిమాతో ఆమెకి ఆ అవకాశం లభించింది. దాంతో త్రిష చాలా హ్యాపీగా ఫీలవుతోంది. ఈ సినిమా హిట్ అయితే తనకి అంతకి మించిన ఆనందం మరొకటి లేదంటూ సన్నిహితులతో చెబుతోందట.