'ఎన్టీఆర్' కోసం చైతన్య రథయాత్రకి సన్నాహాలు
- షూటింగు దశలో 'ఎన్టీఆర్'
- 3 షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి
- 4వ తేదీ నుంచి 4వ షెడ్యూల్
'చైతన్యరథయాత్ర'కి సంబంధించిన నేపథ్యంలో షూటింగు కొనసాగుతుంది. శ్రీకాకుళం .. విజయనగరం .. విశాఖ .. అన్నవరం .. గుంటూరు జిల్లాల్లో ఈ రథయాత్రను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషించనున్నాడు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టు అవుతుంది. నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.