అక్షయ్ కుమార్ పాత్ర గురించి శంకర్
- రజనీ కాంత్ కథానాయకుడిగా '2.ఓ'
- ఊహకందని విధంగా అక్షయ్ పాత్ర
- దీపావళికి ట్రైలర్ విడుదల
అక్షయ్ కుమార్ ఈ సినిమాలో 'క్రో మ్యాన్' గా కనిపించనున్నాడని కొంతమంది అంటుంటే, డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో కనిపించనున్నాడని మరి కొంతమంది అంటున్నారు. ఈ ప్రచారం శంకర్ వరకూ వెళ్లడంతో ఆయన ఈ విషయంపై స్పందించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ 'క్రో మ్యాన్' గా గానీ .. డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో గాని కనిపించడం లేదని ఆయన చెప్పారు. ఎవరి ఊహలకు అందనట్టుగా ఆయన పాత్రను డిజైన్ చేసినట్టుగా స్పష్టం చేశారు. దాంతో ఈ ప్రచారానికి తెరదించినట్టయింది. దీపావళికి ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు.