Rahul Gandhi: రాహుల్ గాంధీ-కరీనాపూర్ లవ్ స్టోరీ.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ రషీద్ కిద్వాయి!

  • రాహుల్ ను ఇష్టపడ్డ కరీనాకపూర్
  • డేట్ కు వెళ్లాలని 2002లో నిర్ణయం
  • సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ పుస్తకంలో వెల్లడి

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ కొన్నాళ్ల క్రితం హీరో సైఫ్ ఆలీఖాన్ పటౌడీని పెళ్లాడింది. ఈ దంపతులకు తైమూర్ అనే పిల్లాడు ఉన్నాడు. వివాహానికి ముందు కరీనా షాహీద్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్లు, చివరి క్షణంలో వీరి పెళ్లి ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ మరో ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టారు. ఓ సందర్భంలో కరీనా కపూర్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని తెగ ఇష్టపడినట్లు ఆయన తెలిపారు.

తన పుస్తకం ‘నేతా-అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటంతో 2002లో కరీనా రాహుల్ తో డేట్ కు వెళ్లాలని అనుకున్నారట. అంతేకాదు, కరీనా నటించిన ఏ సినిమానైనా రాహుల్ గాంధీ ఫస్ట్ డే ఫస్ట్ షోను చూసేవారట. గతంలో ఓ టీవీ షోకు హాజరైన కరీనా.. రాహుల్ గాంధీతో డేట్ కు వెళ్లడాన్ని ఇష్టపడతానని చెప్పిన సంగతిని కిద్వాయి తన పుస్తకంలో ప్రస్తావించారు. గాంధీ, కపూర్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అప్పట్లో కరీనా స్వయంగా చెప్పినట్లు కిద్వాయి ఉటంకించారు.

Rahul Gandhi
kareena kapoor
rashid kidway
book
nata abhineta
love
date
Bollywood
  • Loading...

More Telugu News