సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మళ్లీ బిజీ అవుతున్న నిత్యా మీనన్
- కొత్త జోనర్ లో చేస్తున్న రవితేజ
- 6 కోట్లకు విజయ్ సినిమా డబ్బింగ్ రైట్స్
* రవితేజ తొలిసారిగా ఓ యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో ఒకరిగా నభా నటేష్ ను ఇప్పటికే ఎంపిక చేశారు.
* తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్కార్' తెలుగు డబ్బింగ్ రైట్స్ భారీ ధర పలికాయి. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ హక్కులను 6 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. నవంబర్ 7న ఈ చిత్రం విడుదల అవుతుంది.