నా కుమార్తెను చంపేశారు... ఫిర్యాదు చేసిన తమిళనాడు ఎస్ఐ!
- చెన్నై వాల్ టాక్స్ రోడ్డులో యాక్టివాపై వెళుతున్న రమ్య
- లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మృతి
- ప్లాన్ ప్రకారం లారీతో ఢీకొట్టించారంటున్న తండ్రి
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో పోలీసులు లారీ డ్రైవర్ పళనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదం కాదని ఆరోపిస్తూ, తుళసింగం ఎలిఫెంట్ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామ రత్తినం, బావమరిది ఎత్తిరాజ్ కలసి ప్లాన్ చేసి కుమార్తెను లారీతో గుద్దించారని ఆయన ఆరోపిస్తుండగా, పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.