తమిళ రీమేక్ పట్ల నాని ఆసక్తి .. నిర్మాతగా దిల్ రాజు
- నాని తాజా చిత్రంగా 'దేవదాస్'
- తదుపరి సినిమాగా 'జెర్సీ'
- దిల్ రాజు నిర్మాతగా మరో మూవీ
తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా '96' మూవీ రూపొందింది. విభిన్నమైన కంటెంట్ తో నిర్మితమైన ఈ సినిమాను తమిళంలో వచ్చేనెల 4వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కథా కథనాలు నచ్చడంతో తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకున్నారట. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను తెలుగులో నాని చేస్తే బాగుంటుందని భావించిన దిల్ రాజు, ఆ సినిమాను నానికి చూపించారట. నాని కూడా ఈ సినిమా చేయడానికి సానుకూలంగా స్పందించడం జరిగిందని అంటున్నారు.