'బొమ్మరిల్లు' భాస్కర్ తో వెంకీ మూవీ?
- 'ఎఫ్ 2' సినిమా షూటింగులో వెంకీ
- నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో అంటూ టాక్
- మరో వైపున కథతో సిద్ధంగా 'బొమ్మరిల్లు' భాస్కర్
అయితే ఇటీవల వెంకటేశ్ ను కలిసిన 'బొమ్మరిల్లు' భాస్కర్, ఆయనకి ఒక కథను వినిపించాడట. కథలోని కొత్తదనం కారణంగా వెంటనే వెంకటేశ్ ఓకే చెప్పేశారని అంటున్నారు. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేసే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే 'బొమ్మరిల్లు' భాస్కర్ తో వెంకటేశ్ సెట్స్ పైకి వెళతాడట. లేదంటే త్రివిక్రమ్ తో చేసిన తరువాత 'బొమ్మరిల్లు' భాస్కర్ మూవీ చేస్తారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.