యాక్షన్ సీన్స్ తో బిజీగా నందమూరి హీరో
- గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- కథానాయికలుగా నివేదా .. షాలినీ పాండే
- సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర
గుహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. కల్యాణ్ రామ్ .. కొందరు ఫైటర్స్ కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.