కృష్ణా జిల్లాలో అర్చకులు వర్సెస్ ఇరిగేషన్ అధికారులు.. రోడ్డుపైనే పిండప్రదానం చేసిన పురోహితులు!
- దుర్గాఘాట్ గేటును మూసేసిన అధికారులు
- ఆందోళనకు దిగిన అర్చకులు
- వెంటనే గేటును తెరవాలని డిమాండ్
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. గతంలో కూడా ఈ గేటును అధికారులు మూసివేశారనీ, ప్రభుత్వ జోక్యంతో మళ్లీ తెరిచారని వెల్లడించారు. దుర్గాఘాట్ ను నమ్ముకుని దాదాపు 100 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయనీ, ఇప్పుడు అధికారులు అడ్డుకుంటే తామెలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే దుర్గాఘాట్ గేట్లను తెరిపించాలని డిమాండ్ చేశారు.