తన ఇల్లు ఆక్రమించుకుందంటూ.. కూతురిపై సినీ నటుడు విజయకుమార్ ఫిర్యాదు
- షూటింగ్ కోసం ఇంటిని అద్దెకు తీసుకుని, ఖాళీ చేయని వనిత
- పోలీసులను ఆశ్రయించిన విజయకుమార్
- ఈ ఇంట్లో తనకు కూడా వాటా ఉందంటూ వనిత వాదన
ఈ నేపథ్యంలో, వనితపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న అలపాక్కమ్ లోని ఇంటికి వెళ్లి వనితను విచారించగా... ఈ ఇంట్లో తనకు కూడా భాగముందని, అందుకే తాను ఖాళీ చేయనని ఆమె స్పష్టం చేసింది. ఇల్లు మీదని చెప్పడానికి ఆధారాలు చూపాలని పోలీసులు అడగ్గా... వారితో వనిత వాగ్వాదానికి దిగింది. ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లగా... ఫొటోగ్రాఫర్ల కెమెరాలను ఆమె నేలకేసి కొట్టింది. ఇంతకు ముందు నుంచే విజయకుమార్, వనిత కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి.