'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్
- అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు
- 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీలో ఆయన పోలికలు ఎక్కువగా సుమంత్ లో కనిపిస్తాయనే సంగతి తెలిసిందే. 'ఎన్టీఆర్' బయోపిక్ లో సుమంత్ .. అక్కినేని ట్రేడ్ మార్క్ కళ్లజోడు .. లాల్చీతో అచ్చు అలాగే చూస్తూ అక్కినేనిని గుర్తుచేస్తున్నాడు. మధ్య వయసులో అక్కినేని ఎలా ఉండేవారో అలాగే అనిపిస్తున్నాడు. బాలకృష్ణ .. సుమంత్ (ఎన్టీఆర్ - ఏఎన్నార్) కాంబినేషన్లోని మరో పోస్టర్ సాయంత్రం రావచ్చునని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.