'మహానటి'కి అంత బడ్జెట్ అవుతుందని అనుకోలేదు: అశ్వనీదత్
- 16 కోట్ల వరకూ అవుతుందనుకున్నాము
- 29 కోట్ల వరకూ ఖర్చు అయింది
- క్వాలిటీ పరంగా సంతృప్తినిచ్చింది
"ఈ సినిమా నిర్మాణానికిగాను రంగంలోకి దిగుతున్నప్పుడు ఎంతవరకూ ఖర్చు అవుతుందని నేను మా అమ్మాయి స్వప్నను అడిగాను. 16 .. 17 కోట్లు కావొచ్చని నాతో చెప్పింది. ఆ మాత్రం బడ్జెట్ అయితే ఫరవాలేదు .. సెట్స్ విషయంలో .. గ్రాఫిక్స్ విషయంలో క్వాలిటీ మిస్ కావొద్దు' అని చెప్పాను. అనుకున్న బడ్జెట్ దాటిపోయి 29 కోట్లవరకూ ఖర్చు అయిందని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ ఫస్టు కాపీ చూశాక .. సినిమా ఎంత క్వాలిటీగా వచ్చిందో చూశాక బడ్జెట్ పెరిగినా ఫరవాలేదనిపించింది. మా కష్టం ఫలించినందుకు సంతృప్తి లభించింది " అని చెప్పుకొచ్చారు.