Renuka Chowdary: రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని ఇంట దొంగతనం!

  • ఢిల్లీకి వెళ్లిన తేజస్విని దంపతులు
  • వచ్చి చూసేసరికి రూ. 9 లక్షల విలువైన సొత్తు మాయం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి కమార్తె తేజస్విని ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తేజస్వినీ చౌదరి, ఆమె భర్త కిరణ్ రాజు నివాసం ఉంటున్నారు. ఇటీవల వారు ఢిల్లీకి వ్యాపార పని నిమిత్తం వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి, ఇంటి అల్మారాలో ఉండాల్సిన రూ. 3 లక్షల విలువైన కార్టియర్ వాచీ, రూ. 3 లక్షల నగదు, రూ  3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. దీంతో తమ ఇంట్లో పనిచేసే రాజమణి అనే పనిమనిషిపై అనుమానం ఉందని చెబుతూ పోలీసులను ఆశ్రయించారు. తేజస్విని మేనేజర్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Renuka Chowdary
Tejaswini
Theft
Hyderabad
Police
  • Loading...

More Telugu News