అమృత వర్షిణికి అసెంబ్లీ టికెట్... నిలిపితే ఏకగ్రీవం చేస్తామన్న తమ్మినేని, ఐలయ్య!
- అమృతను ఓదార్చిన తమ్మినేని వీరభద్రం, కంచె ఐలయ్య
- చట్టసభకు పంపేందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలి
- హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
ప్రణయ్ పై దాడి ఘటనపై కేసీఆర్ స్పందించలేదని, హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిల్లో ఎవ్వరూ పరామర్శించడానికి రాలేదని వారు ఆరోపించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని, కానీ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్ చేయలేదదని వారు ప్రశ్నించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలయ్య డిమాండ్ చేశారు.