మరో ప్రేమకథను తెరకెక్కించనున్న శేఖర్ కమ్ముల
- టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్న ధృవ్
- ఏషియన్ గ్రూప్ నిర్మాణ సారధ్యంలో సినిమా
- పూర్వ నిర్మాణ పనులు పూర్తి
అయితే ఈ చిత్రంలో హీరో ధృవేనా? లేదంటే మరొకరా? అనే విషయం మాత్రం తెలియరాలేదు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాను ఇప్పటి వరకూ పంపిణీ, ప్రదర్శన రంగాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఏషియన్ గ్రూప్ నిర్మించనుంది. ఈ సంస్థకు ఇది తొలి సినిమా. ఇప్పటికే ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలనూ త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహనరావు తెలిపారు.