'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రిలీజ్ వాయిదా?
- ముగింపు దశలో రవితేజ మూవీ
- కథానాయికగా ఇలియానా
- అక్టోబర్ 14వ తేదీన విడుదల
కొన్ని కారణాల వలన ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకున్నారని సమాచారం. డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఒక్కసారిగా ఈ సినిమా రెండు నెలల పాటు వాయిదా పడటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దసరా రోజుల్లో వస్తోన్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్. ఏదేమైనా ఈ వార్త రవితేజ అభిమానులకు నిరాశను కలించేదేనని చెప్పుకోవాలి.