ప్రతి సినిమాకి నేను భయపడుతూనే వుంటాను: దర్శకుడు మారుతి
- ఇది కోట్ల రూపాయల వ్యవహారం
- ఎవరూ ఎలాంటి రిస్కులు చేయరు
- ఈ సినిమాపోతే ఇంకో సినిమా ఇవ్వరు
అందువలన రేపటి రోజున దర్శకుడిగా నాకు అవకాశాలు లేకపోయినా, నేను ఏం చేయాలనే విషయంలో నాకు ఒక క్లారిటీ వుంది. ఇక్కడి పరిస్థితుల కారణంగానే నేను ప్రతి సినిమాకి భయపడిపోతుంటాను. ఎందుకంటే ఈ సినిమాపోతే ఎవరూ నెక్స్ట్ మూవీ ఇవ్వరు. సినిమా హిట్ అయితే ఒక ఐదారు సినిమాల అడ్వాన్సులు కనిపిస్తాయి. ఈ సినిమాపోయినా ఫరవాలేదు ... ఆ తరువాత లైన్లో ఆ ప్రొడ్యూసర్ వున్నాడు .. ఈ ప్రొడ్యూసర్ వున్నాడు అనుకుంటాము. ఈ సినిమా పోయిందనుకోండి .. వాళ్లంతా 'తరువాత చేద్దామమ్మా' అంటారు. ఇది కోట్ల రూపాయలకి సంబంధించిన వ్యవహారం కావడం వలన ఎవరూ రిస్క్ చేయరు' అని చెప్పుకొచ్చాడు.