ప్రతిపక్షాలపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్.. లోక్‌సభ ఎన్నికల బరిలోకి అక్షయ్, మోహన్‌లాల్, మాధురీ దీక్షిత్!
- ప్రతిపక్షాలను దెబ్బకొట్టే వ్యూహం
- 70 మంది ప్రముఖులను ఇప్పటికే ఎంపిక చేసిన బీజేపీ?
- బరిలో సినీ, క్రీడా, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు
సినీ రంగం నుంచి అక్షయ్ కుమార్, సన్నీడియోల్, మాధురీ దీక్షిత్, మోహన్‌లాల్, క్రికెట్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ తదితరులను బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నట్టు బీజేపీ నేత ఒకరు వెల్లడించారు. వారందరూ దేశ ప్రజలకు చిరపరిచితులని, కాబట్టి విజయం నల్లేరుపై నడకేనని బీజేపీ భావిస్తోంది. అక్షయ్ కుమార్‌ను న్యూఢిల్లీ నుంచి, గుర్‌దాస్‌పూర్ నుంచి సన్నీడియోల్‌ను, ముంబై నుంచి మాధురీ దీక్షిత్‌ను, తిరువనంతపురం నుంచి మోహన్‌లాల్ ను లోక్‌సభ బరిలోకి దించాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించేసిందని ముఖ్య నేత ఒకరు తెలిపారు.