అందరూ నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది: రమ్యకృష్ణ
- 'శైలజారెడ్డి' సినిమాలో నా పాత్రను మారుతి అద్భుతంగా మలిచారు
- రెగ్యులర్ అత్త పాత్రలా ఉండదు
- పుట్టినరోజు సందర్భంగా హిట్ కొట్టడం సంతోషంగా ఉంది
ఈ చిత్రం కోసం అందరూ చిత్తశుద్ధితో పని చేశారని రమ్యకృష్ణ తెలిపారు. ఈ సినిమాను చూసిన వారంతా తన పాత్ర గురించి మాట్లాడుతుండటం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తన పాత్రను దర్శకుడు మారుతి అద్భుతంగా మలిచారని తెలిపారు. ఈ చిత్రంలో అత్త పాత్ర రెగ్యులర్ గా ఉండదని, ఎప్పుడూ చూసే అత్తాఅల్లుళ్ల మధ్య రొటీన్ కామెడీ ఉండదని చెప్పారు. ఈ సినిమా స్వీట్ సర్ ప్రైజ్ లా ఉంటుందని తెలిపారు.