మారుతికి మరో ఛాన్స్ ఇచ్చిన నాగార్జున?
- చైతూ హీరోగా వచ్చిన 'శైలజా రెడ్డి అల్లుడు'
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
- నాగార్జునను మెప్పించిన మారుతి
అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు తన సినిమాలో ఉండేలా చూసుకోవడం మారుతి ప్రత్యేకత. ఆయనలోని ఆ ప్రత్యేకత నచ్చడం వల్లనే నాగార్జున మరో ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఆల్రెడీ నెక్స్ట్ ప్రాజెక్టుకి సంబంధించిన అడ్వాన్స్ కూడా మారుతికి ముట్టినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా అఖిల్ తో ఉండొచ్చని అంటున్నారు. ఇంతకుముందు మారుతి అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తికాగానే అన్నపూర్ణ బ్యానర్లో చేస్తాడని చెప్పుకుంటున్నారు.