వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరికి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
- అంతర్జాతీయంగా మనీల్యాండరింగ్‌తో సంబంధాలు
- అరబ్, సింగపూర్‌లలోని సంస్థలకు యజమానురాలిగా పుర్వి
- మిహిర్ ఆర్ భన్సాలీకి కూడా నోటీసులు
సింగపూర్, అరబ్ దేశాల్లో ఉన్న కొన్ని వ్యాపార సంస్థలకు పుర్వి యజమానిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాపార సంస్థలకు సంబంధించి కొన్ని లావాదేవీలు ఆమె పేరుతోనే జరిగినట్టు ఈడీ తెలిపింది. ఆమెతోపాటు నీరవ్ మోదీ వ్యాపార సంస్థలో టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన మిహిర్ ఆర్ భన్సాలీకి కూడా ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసింది.