అక్టోబర్ నుంచి సెట్స్ పైకి గోపీచంద్ కొత్త చిత్రం?
- కొత్త దర్శకుడితో గోపీచంద్
- తరువాత సినిమా సంపత్ నందితో
- దసరాకి లాంచ్ చేసే ఆలోచన
గతంలో సంపత్ నంది .. గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన 'గౌతమ్ నంద' పరాజయం పాలైంది. అయినా ఈసారి సంపత్ నంది వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో 'ఓకే .. చేసేద్దాం' అన్నాడట. గోపీచంద్ మళ్లీ ఛాన్స్ ఇవ్వడంతో ఆయనకి తప్పకుండా హిట్ ఇవ్వడం కోసం సంపత్ నంది గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని సమాచారం. అక్టోబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.