'యాత్ర' నుంచి స్పెషల్ పోస్టర్ .. వైయస్సార్ ను గుర్తుకు తెస్తోన్న మమ్ముట్టి
- షూటింగు దశలో 'యాత్ర'
- దర్శకుడిగా మహి. వి రాఘవ్
- మమ్ముట్టి బర్త్ డే స్పెషల్ గా కొత్త పోస్టర్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొంతకాలం క్రితం ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజున మమ్ముట్టి పుట్టినరోజు కావడంతో, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెస్తూ మమ్ముట్టి ఆకట్టుకుంటున్నాడు. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.