'మా' రచ్చ.. చిరంజీవి ఆగ్రహం.. ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు!
- నిధుల దుర్వినియోగం ఆరోపణలతో రెండుగా చీలిన అసోసియేషన్
- తన పేరు ప్రస్తావనకు రావడంతో చిరు ఫైర్
- ఇలాంటి సమయంలో ఈవెంట్ లో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్
ఈ వివాదంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు అక్టోబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఈవెంట్ ను 'మా' సభ్యులు ఫిక్స్ చేశారు. అయితే, వివాదం నేపథ్యంలో ఈవెంట్ ను మహేష్ బాబు క్యాన్సిల్ చేసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. ఇలాంటి సమయంలో తాను ఈ షోలో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్ ఉన్నాడట. యూఎస్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న మహేష్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడం... 'మా'కు పెద్ద షాకే.