ఈషా రెబ్బాను ఇబ్బంది పెట్టిన ఇండిగో సిబ్బంది!
- ఇండిగో సిబ్బందిపై నటి ఫైర్
- ఎవ్వరూ ఇండిగోలో వెళ్లవద్దని పిలుపు
- ఓ నెటిజన్ ట్వీట్ కు స్పందించిన హీరోయిన్
ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ, ‘‘ఇండిగో కారణంగా నేను విమానం మిస్ కావడం ఈ వారంలో ఇది రెండోసారి. ఇదంతా కేవలం ఇండిగో ఉద్యోగుల పొగరు కారణంగానే జరిగింది. వాళ్లు నన్ను ‘ఒక్క నిమిషం ఆగండి’.. ‘10 నిమిషాలు ఆగండి’ అంటూ వెయిట్ చేయించారు. చివరికి నన్నే ‘నువ్వు 5 నిమిషాలు లేట్ గా వచ్చావు’ అంటూ దబాయించారు’’ అంటూ పేర్కొన్నాడు.
దీనిపై ఈషా స్పందిస్తూ.. తాను కూడా ఇండిగో కారణంగా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లు తెలిపింది. తాను ఇండిగోలో ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ‘ఇండిగోలో ఎప్పుడూ ఎక్కవద్దు. ఇండిగోకు దూరంగా ఉండండి’ అని ట్వీట్ చేసింది.