Girlfriend: ప్రియుడని నమ్మి తన రహస్య వీడియోలు పంపినందుకు మూల్యం చెల్లించుకున్న యువతి!

  • యువకుడిని ప్రేమించిన యువతి
  • నమ్మి తన ప్రైవేటు చిత్రాలు, వీడియోలు పంపిన యువతి
  • వాటిని అడ్డంపెట్టుకుని అకృత్యాలు

హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చాలంటూ గాళ్‌ఫ్రెండ్‌ను బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు గాళ్‌ ఫ్రెండ్ అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలను చూపించి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఆమె ఉంటున్న లేడీస్ హాస్టల్‌లోని బాత్రూములో రహస్య కెమెరా అమర్చి హాస్టల్‌లోని మిగతా అమ్మాయిల నగ్న చిత్రాలు తనకు పంపాలని బెదిరించాడు. విషయం బయటకు రావడంతో నిందితుడితోపాటు యువతిని కూడా అరెస్ట్ చేశారు.

నిందితుడిని తమిళనాడుకు చెందిన సిద్ధార్థ్‌ (21)గా పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ్‌ను ప్రేమించిన బాధితురాలు అతడిని నమ్మి తన నగ్న చిత్రాలు, వీడియోలను అతడికి పంపించింది. తర్వాత వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. హాస్టల్ బాత్రూములో రహస్య కెమెరాలు అమర్చాలని చెప్పాడు. దాంతో భయపడిన యువతి, అతడు చెప్పినట్టే చేసి, మరో ముగ్గురి వీడియోలను తీసి పంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి కూడా ఉంది.

కాగా, నిందితుడు సామాన్యుడు కాదని, హాస్టల్‌లో ఉన్న తన కుమార్తెను చూడడానికి వచ్చిన ఓ మహిళ నగ్న దృశ్యాలను కూడా రహస్యంగా చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నారు.

Girlfriend
nude
boyfriend
spy cam
hostel bathroom
  • Loading...

More Telugu News