'ఎన్టీఆర్' బయోపిక్ లో ఎస్వీఆర్ గా నాగబాబు?
- శ్రీదేవి పాత్రలో రకుల్
- జయప్రదగా రాశిఖన్నా
- నెక్స్ట్ షెడ్యూల్లో అసెంబ్లీ సీన్స్
ఇక ఈ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో 'నాగబాబు'ను తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'మహానటి' సినిమాలో ఎస్వీరంగారావు పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి గల ప్రత్యేకమైన అనుబంధం కారణంగా, 'ఎన్టీఆర్' బయోపిక్ లోను ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ 'మహానటి'లో చేసినవాళ్లనే తీసుకుంటే కొత్తదనాన్ని ఆడియన్స్ మిస్ అవుతారనే ఉద్దేశంతో నాగబాబును సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్రకి నాగబాబు సరిగ్గా సరిపోతారనీ .. ఇటీవల ఆయన గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో వేరే వారితో డబ్బింగ్ చెప్పించ వచ్చని అనుకుంటున్నారు.