'అదుగో' నుంచి ఫస్టులుక్ వచ్చేసింది
- పందిపిల్ల ప్రధాన పాత్రగా 'అదుగో'
- టైటిల్ లో 'అ' సెంటిమెంట్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఒక పందిపిల్లను ప్రధాన పాత్రగా చేసుకుని ఆయన ఈ సినిమాను రూపొందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఒక ఫస్టులుక్ ను వదిలాడు. పందిపిల్ల .. హాయ్ అని పలకరిస్తూ తన పేరు 'బంటీ' అంటూ పరిచయం చేసుకుంటున్నట్టుగా ఈ పోస్టర్ ను వదిలారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పందిపిల్లతో రవిబాబు చేసిన ప్రయోగం ఎలాంటిదో తెలుసుకోవడానికి అంతా కూడా చాలా ఆసక్తిగా వున్నారు.