రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'ఇదం జగత్'
- 'ఇదం జగత్' పూర్తిచేసిన సుమంత్
- నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర
- వచ్చేనెల 28వ తేదీన విడుదల
పద్మావతి .. శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, వచ్చేనెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇంతవరకూ సుమంత్ సాఫ్ట్ గా వుండే పాత్రలను చేస్తూ వచ్చాడు. మొదటిసారిగా ఈ సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేయడం విశేషం. అదే ఈ సినిమాకి మరింత ప్రత్యేకత కానుంది. కొత్త కంటెంట్ తో .. విభిన్నమైన పాత్రతో వస్తోన్న సుమంత్ కి ఈ సారైనా హిట్ పడుతుందేమో చూడాలి.