26 సెంటర్లు .. 50 రోజులు .. 'ఆర్ ఎక్స్ 100' విజయవిహారం
- కార్తికేయ హీరోగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100'
- యూత్ ను కట్టిపడేసిన కంటెంట్
- చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం
ఫలితంగా ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తిచేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో 26 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోవడం పట్ల ఈ సినిమా టీమ్ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తోంది. ఒక చిన్న సినిమా ఇన్నేసి థియేటర్స్ లో .. ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు అజయ్ భూపతికి .. హీరో కార్తికేయకి .. కథానాయిక పాయల్ రాజ్ పుత్ కి వరుస అవకాశాలు వస్తోన్న సంగతి తెలిసిందే.