మల్టీ స్టారర్లు చేయనని చెప్పేసిన నాగశౌర్య!
- మల్టీ స్టారర్ సినిమాల దిశగా సీనియర్ హీరోలు
- ఆసక్తిని చూపుతోన్న యువ కథానాయకులు
- తనకి ఇష్టం లేదంటోన్న నాగశౌర్య
ఈ నేపథ్యంలో యువ హీరో నాగశౌర్య మాత్రం తాను ఇక మల్టీ స్టారర్లు చేయనని చెప్పేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు నారా రోహిత్ తో వున్న సాన్నిహిత్యం కారణంగా ఆయనతో కలిసి నటించానని, ఇకపై మాత్రం మల్టీస్టారర్ మూవీలు చేయదలచుకోలేదని అన్నాడు. ఈ తరహా సినిమాల్లో తన పాత్రకి తగిన ప్రాధాన్యత దక్కుతుందో లేదోననే సందేహంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరింత క్రేజ్ ను సంపాదించుకునేంత వరకూ సోలో హీరోగా ముందుకు వెళ్లడమే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన అలా అని ఉండొచ్చని మరికొందరు చెప్పుకుంటున్నారు.