నందమూరి హరికృష్ణ మృతిపై స్పందించిన హీరోయిన్ సిమ్రాన్!
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిమ్రాన్
- కుటుంబ సభ్యులకు సానుభూతి
- ట్విట్టర్ లో స్పందించిన నటి
‘నందమూరి హరికృష్ణ ఇక లేరన్న వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని సిమ్రాన్ ఈ రోజు ట్వీట్ చేశారు. సిమ్రాన్ హరికృష్ణతో కలసి 'సీతయ్య' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.