సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- డబ్బింగ్ చెప్పనున్న మరో నాయిక
- పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ!
- మరో చిత్రంలో హీరోగా షకలక శంకర్
* తాజాగా విడుదలైన 'గీత గోవిందం' చిత్రంతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన విజయ్ దేవరకొండ త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
* 'జబర్దస్త్' ఫేం షకలక శంకర్ హీరోగా మరో చిత్రాన్ని చేయనున్నాడు. 'శంభో శంకర' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన శంకర్ ప్రస్తుతం 'డ్రైవర్ రాముడు', 'కేడీ నెం 1' చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలో తన నాలుగో చిత్రాన్ని కూడా అంగీకరించాడు.