'కత్తి' హిందీ రీమేక్ కి సన్నాహాలు .. పరిశీలనలో ఇద్దరు హీరోల పేర్లు
- అక్షయ్ తో చేసిన సంజయ్ లీలా బన్సాలి
- రీమేక్స్ గా చేసిన 'రౌడీ రాథోడ్' .. 'గబ్బర్'
- అదే కాంబినేషన్లో 'కత్తి' అంటూ టాక్
అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కథలో ఆయన కొన్ని మార్పులను చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ గానీ .. రణ్ వీర్ సింగ్ గాని నటించే అవకాశాలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో 'విక్రమార్కుడు'ను 'రౌడీ రాథోడ్' పేరుతోనూ, 'రమణ' సినిమాను 'గబ్బర్' పేరుతోను సంజయ్ లీలా బన్సాలి రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ అక్షయ్ కుమార్ హీరోగా చేశాడు. కనుక .. 'కత్తి' రీమేక్ లోను ఆయనే హీరోగా చేసే ఛాన్స్ ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.