బుల్లితెరపై కామెడీ పండించేందుకు సిద్ధమవుతున్న బ్రహ్మానందం
- త్వరలోనే ఓ చానల్‌లో కామెడీ షో
- హోస్ట్‌గా వ్యవహరించనున్న బ్రహ్మీ
- ప్రోమోలో తనదైన పంచ్‌లు
బ్రహ్మానందం ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. స్టార్ హీరో సినిమాల్లో తప్ప చిన్న సినిమాల్లో నటించడం లేదు. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు బుల్లితెరపై పడింది. త్వరలోనే టీవీ తెరపై కనిపించనున్న ఆయన ‘స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు’ అంటూ ప్రోమోలో ఆయన చేసిన సందడి అందరినీ ఆకర్షిస్తోంది. అయితే, షో ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయం తెలియరాలేదు.