పునర్జన్మల నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ మూవీ?
- బన్నీ కోసం కథ రెడీ
- దర్శకుడిగా విక్రమ్ కుమార్
- వచ్చేనెలలో సెట్స్ పైకి
బన్నీ నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వుండనుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కథ ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తుతోంది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. కీలకమైన పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది కనుక, బన్నీ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడట. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది .. ఈ లోగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.