గుజరాత్ లో స్వీపర్ తో పేషంట్ కు కుట్లు వేయించిన గవర్నమెంట్ డాక్టర్లు!
- తమాషా చూసిన వైద్యులు, నర్సులు
- బహరూచ్ సివిల్ ఆస్పత్రిలో ఘటన
- విచారణకు ఆదేశించిన అధికారులు
గుజరాత్ లోని బహరూచ్ సివిల్ ఆసుపత్రికి ఓ యువకుడు తలకు గాయంతో వచ్చాడు. దీంతో వైద్యులు అక్కడే ఉన్న స్వీపర్ బ్రిజేష్ సోలంకీకి ఈ పనిని పురమాయించారు. దీంతో అతను బాధితుడి తలకు కుట్లు వేయడం ప్రారంభించాడు. తతంగం మొత్తాన్ని బాధితుడి బంధువు ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీడియా ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. స్వీపర్ చేత కుట్లు వేయించిన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి రెసిడెంట్ ఆఫీసర్ ఎస్ ఆర్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.