పెళ్లయిన హీరోయిన్ల పట్ల నిర్మాతలు, దర్శకుల మైండ్ సెట్ మారాలి: సిమ్రాన్
- పెళ్లైతే అమ్మ పాత్రలే ఇస్తారా?
- ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ లు పెళ్లయ్యాక కూడా అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారు
- జ్యోతిక మంచి పాత్రలు చేస్తోంది
ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న మీడియా నుంచి సిమ్రాన్ కు ఎదురైంది. దీనికి సమాధానంగా, 'కచ్చితంగా అమ్మ పాత్రలు కాదు' అంటూ సూటిగా చెప్పింది. పెళ్లయితే అమ్మ పాత్రలే ఇస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ లు పెళ్లైన తర్వాత కూడా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారని తెలిపింది. జ్యోతిక కూడా పెళ్లయ్యాక మంచి పాత్రలు చేస్తోందని చెప్పింది. పెళ్లైన నటీమణుల విషయంలో నిర్మాతలు, దర్శకుల మైండ్ సెట్ మారాలని సూచించింది.