సైకిల్ కోసం దాచుకున్న డబ్బును వరద బాధితులకు ఇచ్చేసిన చిన్నారి.. బంపరాఫర్ ఇచ్చిన హీరో కంపెనీ!
- కేరళ వరద బాధితులకు రూ.9 వేలు ఇచ్చిన అనుప్రియ
- నాలుగేళ్లుగా ఈ సొమ్మును దాచుకున్న చిన్నారి
- జీవితాంతం ఏటా ఓ సైకిల్ ఇస్తామని ప్రకటించిన హీరో సంస్థ
తమిళనాడులోని విల్లుపురంకు చెందిన చిన్నారి అనుప్రియ కేరళ వరద వార్తలను టీవీలో చూసింది. తీవ్రంగా చలించిపోయిన ఆ బాలిక తన ఐదు హుండీల్లో దాచుకున్న రూ.9 వేలను సీఎం సహాయ నిధికి పంపింది. ఈ విషయం పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో హీరో సైకిల్స్ కంపెనీ స్పందించింది.
అనుప్రియను అభినందించిన హీరో సైకిల్స్ సంస్థ.. ఆమెకు కొత్త సైకిల్ ను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం అడ్రస్ ను తమ కస్టమర్ కేర్ ఈ-మెయిల్ కు పంపాలని ట్విట్టర్ లో సంస్థ కోరింది. ఇంతలోనే హీరో సైకిల్స్ ఎండీ పంకజ్ ముంజల్ కూడా స్పందించారు. చిన్నారి అనుప్రియకు ప్రతిఏటా ఓ సైకిల్ చొప్పున జీవితాంతం అందిస్తామని ప్రకటించారు. దీంతో అనుప్రియ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.