కాస్టింగ్ కౌచ్ నిజమే... నాలుగు రోజుల క్రితం ప్రపోజల్ వచ్చిందన్న 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్!
- అమ్మాయిలను పిలవడం 100 శాతం నిజం
- నా ముందుకు ఒక వ్యక్తి ప్రపోజల్ తెచ్చాడు
- తాను కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదన్న పాయల్ రాజ్ పుత్
ఈ మాటలను తప్పకుండా ప్రచురించాలని చెబుతూ, "ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇటువంటి కోరికతో ఒకరు నా ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను కాంప్రమైజ్ అయి ఈ స్థాయికి రాలేదు. నేను టాలెంట్ తోనే వచ్చాను. నేను చెప్పదలచుకున్నది అదే" అని చెప్పింది. తన జీవితంలో ఎన్నడూ కాంప్రమైజ్ అయ్యేపనే లేదని కుండబద్దలు కొట్టింది పాయల్ రాజ్ పుత్. ఇక తనను ఇలా అడిగింది ఎవరన్న విషయాన్ని మాత్రం ఈ భామ వెల్లడించలేదు.