నిజాలు దాచను.. నా జీవితంలోని అన్ని కోణాలు ప్రజలకు తెలియాలి: ఐశ్వర్య రాయ్
- బాలీవుడ్ లో మరో బయోపిక్
- ఐశ్వర్య రాయ్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహకాలు
- నా జీవిత చరిత్రను తెరకెక్కించాలని తాను కూడా కోరుకుంటున్నానన్న ఐష్
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నటి ఐశ్యర్య రాయ్ జీవితకథతో సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మధ్య తరగతి కుటుంబం నుంచి ప్రపంచ సుందరిగా, బాలీవుడ్ అగ్ర తారగా, అమితాబ్ కోడలుగా... ఇలా ఐశ్వర్య జీవితంలో ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు పలు వివాదాలు, హీరోలతో అఫైర్లు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ చూపిస్తూ సినిమా తీస్తే... సూపర్ హిట్ కావడం ఖాయమని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఈ వార్తపై ఐష్ కూడా స్పందించింది. తన జీవిత చరిత్ర తెరకెక్కాలనే తాను కూడా కోరుకుంటున్నానని ఆమె తెలిపింది. తన జీవితంలో ఉన్న అన్ని కోణాలు ప్రజలకు తెలియాలని... ఏదీ దాచాలని తాను అనుకోవడం లేదని చెప్పింది. తన జీవితం ఒక గొప్ప కథ అవుతుందని తెలిపింది.